KL Rahul: జట్టు వాతావరణం తేలికగా ఉండి కొంత స్వేచ్ఛగా లభించే టీమ్ తరఫున ఆడాలనుకుకోవడంతోనే లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీని వీడినట్లు కేఎల్ రాహుల్ చెబుతున్నాడు. గత సీజన్ వరకు ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఈ సారి మెగా వేలంలోకి వచ్చాడు. అతడిని రిటైన్ చేసుకోవడానికి ఎల్‌ఎస్‌జీ ఆసక్తి చూపినా కేఎల్ రాహుల్ అందుకు నిరాకరించాడు.
KL Rahul: గత సీజన్‌లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడడంతో ప్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా బహిరంగంగా తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం రాహుల్ ను తీవ్రంగా బాధించింది. దీంతో ఆ ఫ్రాంఛైజీకి దూరం కావాలని వీడినట్లు తెలుస్తోంది. ఇటీవల రాహుల్ స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఇదే విషయం స్పష్టం చేశాడు. ఐపీల్ లో మళ్లీ కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నానని, తన ఆట ఆడేందుకు స్వేచ్ఛ అవసరం కాబట్టే లక్నోజట్టు నుంచి బయటికి వచ్చానని అంటున్నాడు. రాహుల్ కొంతకాలం నుంచి భారత టీ20 జట్టుకు దూరంగా ఉంటున్న విషయంపై కూడా స్పందించాడు ఆటగాడిగా నేనెక్కడ సరిపోతానో నాకు తెలుసు. తిరిగి జట్టులోకి రావడానికి నేను ఏం చేయాలో కూడా తెలుసన్నాడు. రాబోయే ఐపీఎల్ సీజన్ లో రాణించి మళ్లీ జట్టులో స్థానం సంపాదిస్తానని, టీమిండియా టీ20 జట్టులోకి తిరిగి రావడమే లక్ష్యమని చెప్పాడు కేఎల్ రాహుల్.

