TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుత చైర్మన్ మహేందర్‌రెడ్డికి 62 ఏండ్ల వయసు నిండుతుండటంతో ఆయన పదవీకాలం ఈ నెలలోనే ముగియనున్నది. దీంతో కొత్త చైర్మన్ నియామకానికి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు కమిషన్ వెబ్‌సైట్‌లోని దరఖాస్తును పూర్తి చేసి, ఈ నెల 20న సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను పంపాల్సిందిగా కోరారు.