Krishna sp: కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాజీ మంత్రి పేర్నినానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్.పేట సీఐ విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్పీ వివరాల ప్రకారం, మెడికల్ కాలేజీ దగ్గర జరిగిన నిరసన కేసులో కొందరికి నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్న సమయంలో, సుబ్బన్నను విచారిస్తున్న పీఎస్కు పేర్నినాని తన అనుచరులతో కలిసి గ్రూపుగా వెళ్లినట్లు తెలిపారు.
ఈ చర్యతో పోలీసు వ్యవస్థకు ఆటంకం కలిగించారని ఎస్పీ విమర్శించారు. చట్టపరమైన విధానాలను ఎవరూ దాటరాదని, న్యాయపరంగా విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.