IND vs WI

IND vs WI: నేటి నుంచి భారత్, వెస్టిండీస్ సెకండ్ టెస్ట్

IND vs WI: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు నేటి (అక్టోబర్ 10) నుంచి రెండో, చివరి టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

తొలి టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ కేవలం రెండున్నర రోజుల్లోనే ఇన్నింగ్స్ 140 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. బ్యాటింగ్‌లో రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీలతో అదరగొట్టగా, బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్‌తో పాటు స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్‌లు కూడా రాణించారు.

భారత్ లక్ష్యం: 2-0 క్లీన్ స్వీప్
మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్, ఈ టెస్టును కూడా గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. ఈ విజయం WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు కీలకం కానుంది. మరోవైపు, తొలి టెస్ట్‌లో గట్టి పోటీ ఇవ్వలేకపోయిన వెస్టిండీస్, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.

Also Read: Virat Kohli: కోహ్లీ ముందు మరో రికార్డు.. 54 పరుగులు చేస్తే…

పిచ్, వాతావరణ అంచనాలు
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. అయితే, బ్యాట్స్‌మెన్‌కు కూడా కొంత సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో ఫాస్ట్ బౌలర్లకు కొద్దిగా గాలి సహాయం లభించే ఛాన్స్ ఉంది. వాతావరణం చల్లగా ఉంది. మ్యాచ్ మొదటి రోజు వర్షం పడే అవకాశం తక్కువగా ఉందని, ఉష్ణోగ్రతలు 25 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

తుది జట్టులో మార్పులుంటాయా?
తొలి టెస్టులో గెలిచిన జట్టునే రెండో టెస్టులో కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, యువ ఓపెనర్ సాయి సుదర్శన్ ప్రదర్శనపై విమర్శలు ఉన్నప్పటికీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అతనికి మద్దతుగా నిలిచాడు. యువ ఆటగాళ్లకు సమయం ఇవ్వాలని గిల్ పేర్కొన్నాడు. ఆంధ్ర యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీమిండియాలో జడేజా, కుల్దీప్, సుందర్‌లతో కూడిన స్పిన్ విభాగం, బుమ్రా, సిరాజ్‌లతో కూడిన పేస్ విభాగం బలంగా ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *