PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన అంశం ఖరారైంది. ఈ నెల (అక్టోబర్) 16న ఆయన ఏపీలోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు. గతంలో అమరావతి, విశాఖ పర్యటనల అనంతరం ప్రధాని ఏపీకి రావడం ఇదేకావడం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం ఓర్వకల్లు మండలం నన్నూరులో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.
PM Modi: ఈ మేరకు ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ మేరకు అమరావతి, విశాఖ పర్యటనలను మించేలా మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్ల గురించి ఆయా జిల్లాల అధికారులతో సీఎం చర్చించారు.