Russia-Ukraine

Russia-Ukraine: రష్యా దాడులు మరింత తీవ్రం: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై డ్రోన్ బాంబులు

Russia-Ukraine: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో సాధారణ పౌరుల లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి. తాజాగా, ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలోని ఒక రైల్వే స్టేషన్‌పై రష్యా దళాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. కీవ్ వైపు వెళ్తున్న ఒక ప్రయాణికుల రైలు ఈ దాడుల్లో చిక్కుకుంది, దీంతో రైలులోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి.

30 మందికి పైగా గాయాలు
ఈ డ్రోన్ దాడి తీవ్రత ఇంకా పూర్తిగా తెలియరాలేదు, అయితే ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రీజినల్ గవర్నర్ ఒలేహ్ హ్రిహోరోవ్ ఈ రైలుపై జరిగిన దాడిని ధృవీకరించారు. వైద్యులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయని ఆయన తెలిపారు.

Also Read: Nirav Modi: భారత్‌కు నీర‌వ్ మోదీ అప్ప‌గింతకు లైన్ క్లియ‌ర్.?

జెలెన్‌స్కీ ఆగ్రహం: ప్రపంచం నిర్లక్ష్యం చేయకూడదు
రష్యా దాడుల పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమీ రైల్వే స్టేషన్‌పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. రష్యా సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఈ ఉన్మాద ప్రవర్తన పట్ల ప్రపంచ దేశాలు నిర్లక్ష్యం వహించకూడదు. రష్యా ప్రతిరోజూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోంది, అని జెలెన్‌స్కీ మండిపడ్డారు. యుద్ధాన్ని పరిష్కరించడానికి కేవలం మాట సాయం సరిపోదని, ఐరోపా, అమెరికా దేశాల నుండి తమకు మరింత బలమైన చర్యలు అవసరమని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *