Pawan Kalyan-Dil Raju

Pawan Kalyan-Dil Raju: పవన్ కళ్యాణ్ కోసం దిల్ రాజు భారీ ప్రాజెక్ట్!

Pawan Kalyan-Dil Raju: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. నిర్మాత దిల్ రాజు, పవన్‌తో కలిసి మరో భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వకీల్ సాబ్’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు అదే విజయ సూత్రాన్ని అనుసరిస్తూ, మరో సామాజిక సందేశంతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్ కోసం దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

‘వకీల్ సాబ్’ ఫార్ములా రిపీట్
విశ్వసనీయ సమాచారం ప్రకారం, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవలే పవన్ కళ్యాణ్ డేట్స్‌ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘వకీల్ సాబ్’ మాదిరిగానే, ఈ కొత్త సినిమా కూడా బలమైన సామాజిక సందేశాన్ని అందిస్తూనే, పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌కు తగినట్టుగా, అభిమానుల అంచనాలను అందుకొనేలా రూపొందించాలని ఆయన భావిస్తున్నారు. అంటే, కమర్షియల్ హంగులతో పాటు, కథలో ఒక ప్రయోజనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read: Mirai OTT: ‘మిరాయ్‌’ ఓటీటీ సందడి షురూ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

‘ఓజీ’ సినిమా ఘన విజయం సాధించిన నేప‌థ్యంలో, సరైన కథ దొరికితే పవన్ కళ్యాణ్ రేంజ్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. ఈ ఉత్సాహంలోనే, పవన్ కళ్యాణ్ ఇటీవ‌ల దిల్ రాజుతో మాట్లాడార‌ని, “వకీల్ సాబ్ లాంటి మంచి కథతో వస్తే తప్పకుండా సినిమా చేద్దాం” అని హామీ ఇచ్చార‌ని సమాచారం. దీంతో దిల్ రాజు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథ, అలాగే ఆ కథకు తగిన దర్శకుడి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారట.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించేది ఎవరు అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ‘వకీల్ సాబ్’ వంటి మరపురాని చిత్రాన్ని ఇచ్చిన వేణు శ్రీరామ్‌నే దిల్ రాజు తిరిగి తీసుకుంటారా, లేక ఒక కొత్త దర్శకుడికి ఈ అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. దిల్ రాజు నిర్మించబోయే ఈ కొత్త చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ వార్తతో పవర్ స్టార్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *