Inter Exam Schedule Release

Inter Exam Schedule Release: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Inter Exam Schedule Release: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక! 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE) పూర్తి షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు (BIE-AP) ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది. ఈసారి పరీక్షలను గతంలో కంటే ఒక నెల ముందుగానే, ఫిబ్రవరిలోనే నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. సీబీఎస్‌ఈ (CBSE) పరీక్షల షెడ్యూల్‌కు సమాంతరంగా ఉండేలా ఈ మార్పు చేసినట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు.

ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండాలని మంత్రి సూచించారు. విద్యార్థులు పూర్తి షెడ్యూల్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో కూడా  https://bie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ 2026 పరీక్షల షెడ్యూల్ వివరాలు..

  • ఫిబ్రవరి 23: మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
  • ఫిబ్రవరి 24: రెండో సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
  • ఫిబ్రవరి 25: మొదటి సంవత్సరం ఇంగ్లీషు పేపర్ 1
  • ఫిబ్రవరి 26: రెండో సంవత్సరం ఇంగ్లీషు పేపర్ 2
  • ఫిబ్రవరి 27: మొదటి సంవత్సరం హిస్టరీ పేపర్ 1
  • ఫిబ్రవరి 28: రెండో సంవత్సరం హిస్టరీ/ బోటనీ పేపర్ 2
  • మార్చి 2: మొదటి సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 1
  • మార్చి 3: రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2
  • మార్చి 5: మొదటి సంవత్సరం జూవాలజీ/ మ్యాథ్స్ 1బి
  • మార్చి 6: రెండో సంవత్సరం జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2
  • మార్చి 7: మొదటి సంవత్సరం ఎకనామిక్స్ 1
  • మార్చి 9: రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 2బి
  • మార్చి 10: మొదటి సంవత్సరం ఫిజిక్స్ 1
  • మార్చి 11: రెండో సంవత్సరం ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2
  • మార్చి 12: మొదటి సంవత్సరం కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1
  • మార్చి 13: రెండో సంవత్సరం ఫిజిక్స్ 2
  • మార్చి 14: మొదటి సంవత్సరం సివిక్స్ 1
  • మార్చి 16: రెండో సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2
  • మార్చి 17: మొదటి సంవత్సరం కెమిస్ట్రీ 1
  • మార్చి 18: రెండో సంవత్సరం కెమిస్ట్రీ 2
  • మార్చి 20: మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1
  • మార్చి 21: రెండో సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 2
  • మార్చి 24: మొదటి సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *