America:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస సంస్కరణలతో ఊపు మీదున్నారు. విదేశీయుల రాకను అరికట్టేందుకు టారిఫ్‌ల పెంపు, హెచ్1బీ వీసా రుసుం పెంపుదల తదితర ఆంక్షలను విధిస్తూ వచ్చిన ఆయన తాజాగా, డ్రగ్స్ ముఠాలపై ఏకంగా యుద్ధాన్నే ప్రకటించారు. ఈ మేరకు డ్రగ్స్ ముఠాల నిర్మూలన కోసం ట్రంప్ సంచలన ప్రకటనను విడుదల చేశారు.
America:మాదక ద్రవ్యాల ముఠాలతో (డ్రగ్స్ కార్టెల్స్) తాము ఒక అంతర్జాతీయేతర సాయుధ సంఘర్షణలో ఉన్నామని అమెరికా సంచలన ప్రకటనను విడుదల చేసింది. డ్రగ్స్ ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తున్నామని, వాటిపై సైనిక చర్యలు తీసుకుంటామని ఈ మేరకు ఆ దేశ కాంగ్రెస్‌కు ట్రంప్ అధికారికంగా తెలిపారు. ఈ కీలక నిర్ణయం అమెరికాలో, ఇటు అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చకు దారితీసింది.
America:గత సెప్టెంబర్ నెలలో కరీబియన్ వద్ద అంతర్జాతీయ జలాల్లో అమెరికా సైనిక దళాలు మూడు పడవలను ముంచి వేశాయి. వెనిజులా నుంచి ఆ పడవలు వస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ పడవల్లో ఉన్న 17 మంది మరణించారని సమాచారం. ఈ చర్యను అమెరికా ఆత్మరక్షణ చర్యగా సమర్థించుకుంటున్నది. మరణించిన వారిని చట్టవిరుద్ధ పోరాట యోధులుగా అభివర్ణించింది.
America:డ్రగ్స్ ముఠాలు అమెరికా దేశ సరిహద్దులు దాటి పశ్చిమార్థ గోళం అంతటా నిరంతరం దాడులకు పాల్పడుతున్నాయని వైట్‌హౌస్ విడుదల చేసిన మెనూలో అమెరికా పేర్కొన్నది. అందుకే వాటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించామని ప్రకటించింది. వీరు ఏఏ ముఠాలను లక్ష్యంగా చేసుకున్నారో, ఆ ముఠాలతో మృతులకు ఉన్న సంబంధాలు ఏమిటో? మాత్రం వెల్లడి చేయలేదు.