Curd: పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన ఆహారం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీరానికి శక్తినిచ్చి, ఎముకలు బలపడేందుకు సహాయపడుతుంది. అంతేకాదు, పెరుగు ప్రోబయోటిక్స్, ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. కొంతమందికి ఇది శక్తిని పెంచి, శరీర సామర్థ్యానికి సహాయపడుతుంది. కానీ, ఆయుర్వేదం ప్రకారం దీన్ని సరైన సమయంలో, సరైన పరిమాణంలో మాత్రమే తీసుకోవడం అవసరం.
ఆయుర్వేద శాస్త్రంలో పెరుగు చల్లదనం కలిగిన ఆహారం కాబట్టి మధ్యాహ్నం సమయంలో తినడం ఉత్తమం. ఈ సమయంలో జీర్ణశక్తి బాగా పనిచేసి, శరీరం పెరుగులోని పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. పెరుగులో వేయించిన జీలకర్ర కలిపి తినడం జీర్ణక్రియకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. చక్కెర లేదా ఉప్పు కలిపి తింటే రుచి మాత్రమే కాక, దాని ప్రయోజనాలు కూడా పెరుగుతాయి.
Also Read: Egg And Paneer: కోడి గుడ్డు, పన్నీర్ కలిపి తినొచ్చా.. ఆరోగ్యమే కదా..?
కానీ రాత్రిపూట పెరుగు తినడం ప్రమాదకరమని వైద్యులు, ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పెరుగు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి, కఫం పెరుగుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, సైనస్ సమస్యలు, గొంతు నొప్పి కలగడం సాదారణం. జీర్ణక్రియ మందగించి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. శరీర చల్లబడటంతో నిద్ర సమస్యలు, అలసట, బలహీనత కూడా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రాత్రి పెరుగు తినడం వల్ల చర్మ అలెర్జీలు, మొటిమలు, దురదలు, కీళ్ల నొప్పులు కూడా రావచ్చు. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సమస్యలున్నవారికి ఇది మరింత సమస్యలు కలిగిస్తుంది.
పెరుగును ఎక్కువగా తినడం, చలి రోజులలో రాత్రి లేదా ఉదయాన్నే తినడం మానేయడం చాలా అవసరం. పండ్లు, చేపలు, మాంసం, తేనె, రాగి, బంగాళదుంపలు, టమాటాలు వంటి ఆహారంతో కలపడం కూడా జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. రాత్రి తప్పక తినాలంటే బదులుగా గోధుమ రొట్టె, చక్కెర, జీలకర్ర పొడి కలిపి తినవచ్చు. లేదా మజ్జిగ (బటర్‌మిల్క్) తాగడం భిన్నమైన, తేలికగా జీర్ణమయ్యే ఎంపిక. మొత్తానికి, పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఆహారం. కానీ సరైన సమయాన్ని పాటించడం, రోజుకు సరిగా తినడం, ఇతర ఆహారాలతో సరైన కలయికనే ఆరోగ్యానికి మేలుచేస్తుంది.
NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం