Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మళ్లీ తన వ్యక్తిగత జీవితం, ఆలోచనలపై ఓపెన్‌గా మాట్లాడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. సినిమాలకు కొంత దూరంగా ఉంటూ ప్రస్తుతం నిర్మాతగా పలు ప్రాజెక్టులు తెరకెక్కిస్తున్న సమంత, త్వరలోనే “మా ఇంటి బంగారం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన తాజా భావోద్వేగ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
“మనల్ని మనమే ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ” – సమంత
తన పోస్ట్‌లో సమంత ఇలా రాసుకొచ్చింది:
“30 ఏళ్ల తర్వాత మనం చూసే ప్రపంచం మారిపోతుంది. అందం, మెరుపు అన్నిటిలో మార్పు వస్తుంది. అందుకే జీవితాన్ని ఆస్వాదించాలంటే ఇరవైల్లోనే చేయాలి. లేకపోతే ప్రతిదానికీ ఆలస్యమైందన్న భావన కలుగుతుంది. నా ఇరవైల కాలం అంతా గుర్తింపు కోసం పరిగెత్తడంలోనే గడిచిపోయింది. విశ్రాంతి లేకుండా పని చేసి, నన్నే నేను కోల్పోయాను. ఆ సమయంలో ఎవ్వరూ నాకు నిజమైన ప్రేమ అంటే మనల్ని మనమే ప్రేమించుకోవడమేనని చెప్పలేదు. ఇప్పుడు ఆ అర్థం అయ్యింది” అని పేర్కొంది.
అభిమానులకు ప్రత్యేక సందేశం
సమంత తన అనుభవాలను పంచుకుంటూ, ప్రతి అమ్మాయికి ఒక సందేశాన్ని కూడా ఇచ్చింది. “గతపు తప్పులను మోసుకెళ్లవద్దు. జీవితాన్ని ఆస్వాదించండి, పరుగు తగ్గించండి. మీరు మీలా ఉన్నప్పుడే నిజమైన ధైర్యం, ఆనందం, స్వేచ్ఛ అనుభవిస్తారు” అని చెప్పింది.
View this post on Instagram
కెరీర్ నుంచి వ్యక్తిగత జీవితం వరకు…
సినీ కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సమంత, క్రమంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పెద్ద హీరోలతో కలిసి విజయవంతమైన సినిమాలు చేస్తూ ఓ స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకున్నా, నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడింది. అయితే, ధైర్యంగా పోరాడి మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది.
బాలీవుడ్‌లో కూడా క్రేజ్
‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హానీ’, ‘బన్నీ’ వంటి ప్రాజెక్ట్‌లతో సమంత క్రేజ్ బాలీవుడ్ ప్రేక్షకుల దాకా పాకింది. ప్రస్తుతం నిర్మాతగా కూడా తన ప్రతిభ చాటుకుంటూ ముందుకు సాగుతోంది.
నెటిజన్ల స్పందన
సమంత చేసిన ఈ భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతూ, “నీ మాటల్లో కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది”, “ఇలాంటి స్పూర్తిదాయక ఆలోచనలు పంచుకోవాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.