Neha Shetty: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ‘ఓజీ’ (OG) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సక్సెస్‌ఫుల్ టాక్ వచ్చింది.
‘ఓజీ’ విడుదలైన తర్వాత, సినిమాలో ఒక విషయం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే, ఈ చిత్రంలో డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ఒక ప్రత్యేక పాటలో నటించబోతోందంటూ గతంలో వచ్చిన వార్తలు. ఈ విషయాన్ని నేహా శెట్టి స్వయంగా ఓ ఈవెంట్‌లో కూడా ధృవీకరించింది. కానీ, సినిమా ఫైనల్ కట్‌లో ఆ స్పెషల్ సాంగ్ కనిపించలేదు.
నేహా శెట్టి ఈ పాటలో నటిస్తుందని గతంలో సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ అయినప్పటికీ, దర్శకుడు సుజీత్ అప్పుడు ఈ వార్తలను ఖండించారు. “మేము ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు” అని ఆయన స్పష్టం చేశారు. నేహా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ సినిమాకు సంబంధించిన హింట్స్ ఇవ్వడం వల్లే ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.
Also Read: OG Day 1 Collections: పవన్ కళ్యాణ్ ‘OG’ తొలిరోజు కలెక్షన్స్.. రికార్డుకు అడుగు దూరంలో..!
నేహా శెట్టి పాటను తొలగించడానికి గల కారణంపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. ‘ఓజీ’ సినిమా ముగింపులో మేకర్స్ ‘ఓజీ 2’ కూడా ఉండబోతుందని ప్రకటించారు. దాంతో, నేహా శెట్టిపై తీసిన పాటను సీక్వెల్ (OG 2) కోసం రిజర్వ్ చేసి ఉంచారని ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై చిత్రబృందం త్వరలోనే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఈ పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామాకు సుజీత్ దర్శకత్వం వహించగా, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్యామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. సినిమాకు ఎస్. థమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.