Ponnam Prabhakar: సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదు..

Ponnam Prabhakar: సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్‌లో పలుచోట్ల కొందరు ఇబ్బందులు కలిగించారు, అది సరైనది కాదని చెప్పారు. కేవలం కులాల జనాభా తెలుసుకునేందుకే ఈ సర్వే చేస్తున్నామని వెల్లడించారు.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

తెలంగాణలో ఇది చారిత్రక ఘట్టమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతుందని చెప్పారు. సర్వే సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుందన్నారు. అన్ని రకాల అసమానతలు తొలగించేందుకే సర్వే చేస్తున్నామని తెలిపారు.

కాగా కులవన అయిపోయిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని పలుమార్లు తెలంగాణ మంత్రులు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే ప్రభుత్వ అధికారులు త్వర త్వరగా కులగనున్న పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కసరత్తు చేస్తున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలపై ఆశావాహులు సైతం గట్టి పోటీలో ఉన్నారు ఏ ఊరికి వెళ్ళినా గాని మినిమం అభ్యర్థులు పోటీలో నిలబడతారని పల్లె ప్రజలు చెబుతున్నారు.

 

 

 

 

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *