Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా క్రేజీ మూవీ పుష్ప 2. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ చేస్తుండగా.. టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. డిసెంబరు 4 ఓవర్సీస్ లో రిలీజ్ కానున్న పుష్ప 2. ఇప్పటి నుండే తన వేట మొదలు పెట్టింది.
Pushpa 2: ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అందులో పుష్ప 2 రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు అత్యంత వేగంగా ఐదు లక్షల అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన ఆల్ టైమ్ ఇండియన్ మూవీగా పుష్ప2 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక టికెట్స్ బుకింగ్స్ లోను అదరగొట్టాడు పుష్ప రాజ్. ఇప్పటివరకు అమెరికాలో కేవలం ప్రీమియర్స్ రూపంలోనే 20 వేలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ బుకింగ్ రికార్డ్ అయింది. ఇప్పుడే ఇలా ఉంటె రిలీజ్ నాటికీ అటు ఇటుగా నాలుగు మిలియన్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ అవుతాయని ట్రేడ్ అంచనా వేస్తుంది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి పాన్ ఇండియా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అలాగే ఓవర్సీస్ లోను భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్.