Minor Girls: యాదగిరిగుట్టలో అమానుష ఘటన చోటుచేసుకుంది. దైవ దర్శనం పేరిట ముగ్గురు మైనర్ బాలికలను మోసగించి, అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకులు, లాడ్జ్ యజమాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కలకలం రేగింది.
వివరాల్లోకి వెళితే.. అల్వాల్‌కు చెందిన ముగ్గురు బాలికలతో కొంతమంది యువకులు పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయాన్ని వాడుకొని, “యాదగిరిగుట్టకు దైవ దర్శనానికి తీసుకెళ్తాం” అంటూ బాలికలను రప్పించారు. అక్కడ దర్శనం అనంతరం, వారిని ఒక లాడ్జిలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Kadapa New Mayor: కడప ఇన్‌ఛార్జి మేయర్‌గా ముంతాజ్ బేగంకు బాధ్యతలు
అనంతరం, బాధిత బాలికలను హైదరాబాద్‌లో వదిలి పరారయ్యారు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పిల్లలను నిలదీయగా, వారు జరిగిన విషయాన్ని కన్నీటి పర్యంతంగా వివరించారు. వెంటనే కుటుంబసభ్యులు అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను, వారిని ఆశ్రయించిన లాడ్జ్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను మోసగించి ఇలాంటి ఘోరానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.