Rajanna Sircilla: ఆ అధికారి తెలిసి చేశాడో.. తెలియక చేశాడో.. ఎవరు ఏమీ చేయలేరని ధీమాతోనో.. కానీ, ఓ కార్టూన్‌ను వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేయడం ఆయన ఉద్యోగానికే ఎసరొచ్చింది. కలెక్టర్‌కు సపోర్ట్ కదా అని బేలతనంతో చేసిన ఆ పోస్టుతో ఏకంగా బాధ్యుడైన అధికారిని సస్పెండ్ చేస్తూ ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు చేశారు. అది కూడా ప్రభుత్వ విప్‌కు వ్యతిరేకంగా చేయడంతో అతనిపై వేగంగా వేటు పడింది.
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ పెట్టిన పోస్టుపై స్పందిస్తూ, ఆ జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝూ తాజాగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అసలు ఆ పోస్టు సారాంశం ఇలా ఉన్నది. డియర్ ఆది శ్రీనివాస్ గారూ.. సీఎం నా పనితనాన్ని గుర్తించాడు. నేను ఇక్కడే ఉండి అక్రమార్కుల భరతం పడతా.. పైరవీలు నన్ను తొలగించలేవు.. అంటూ కామెంట్‌తో ఉన్న ఓ కార్టూన్‌ను జిల్లా అధికారుల గ్రూప్‌లో పోస్టు చేశాడు.
Rajanna Sircilla: ఈ పోస్టు జిల్లా వ్యాప్తంగా వైరల్‌గా మారింది. దీంతో జిల్లా కలెక్టర్ సహా ప్రభుత్వ విప్ అనుచరులు, ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యతాయుతమైన అధికారిక హోదాలో ఉండి ఇలాంటి బాధ్యతారాహిత్యమైన మెసేజ్‌ను పోస్టు చేయడం సరికాదని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు ఇది విరుద్ధమని, ఆయన సస్పెన్షన్‌కు మరికొన్ని కారణాలు ఉన్నాయని తెలిపారు.