Hyderabad: ప్రముఖ సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రమణి మాట్లాడుతూ, తమ కుటుంబానికి హిందుత్వం అంటే ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అదే కారణంగా బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. అలాగే సమాజ సేవ చేయడం పట్ల తనకున్న ఆసక్తిని గుర్తుచేస్తూ, బీజేపీలో ఉంటే ప్రజలకు మరింతగా సేవ చేసే అవకాశం లభిస్తుందని భావించి పార్టీలో చేరినట్లు తెలిపారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఆమె, పార్టీలోకి ఆహ్వానించినందుకు బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.