Kavita: సిద్దిపేట జిల్లా చింతమడకలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగంతో స్పందించారు. “నా జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లో చింతమడక గ్రామం నాకు అండగా నిలిచింది. కుటుంబం నుంచి నన్ను విడదీయాలనే ప్రయత్నాలు చేసినా, ప్రజల మద్దతు వల్ల నేను నిలబడగలిగాను” అని ఆమె తెలిపారు.
కవిత స్పష్టం చేస్తూ – “ఏ ఊరు ఎవరి జాగీరు కాదు. కొంతమంది సిద్దిపేట, చింతమడకను తమ సొంత ఆస్తిలా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంక్షలు పెడితే నేను ఇంకా ఎక్కువసార్లు ఇక్కడికి వస్తాను. ప్రతిసారీ సిద్దిపేటకు, చింతమడకకు వస్తూనే ఉంటాను” అన్నారు.
తన అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ – “చింతమడక చిరుత పులులను కన్న నేల. ఈ గ్రామం ఎప్పుడూ ధైర్యానికి, పోరాట తత్వానికి నిదర్శనం. ఇక్కడి ప్రజలు చూపించే ఆత్మస్థైర్యమే నాకు బలమవుతోంది” అని కవిత పేర్కొన్నారు.