Mohanlal: 2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు లభించింది. ఈ నెల 23న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగనుంది.
ఇప్పటివరకు 360కి పైగా చిత్రాలలో నటించిన మోహన్‌లాల్, భారత సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయులైన నటులలో ఒకరుగా నిలిచారు. మలయాళంతో పాటు హిందీ, తమిళం, తెలుగు వంటి అనేక భాషల్లో ఆయన నటన ప్రాశంసలు అందుకుంది.