Election Commission: దేశవ్యాప్తంగా క్రీయాశీలకంగా లేని, నిబంధనలు పాటించని గుర్తింపు లేని రాజకీయా పార్టీలపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. అలాంటి పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం చేపట్టిన రాజకీయ ప్రక్షాళనలో భాగంగా ఈ చర్య తీసుకున్నది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు పార్టీలను రద్దు చేసింది.
Election Commission: దేశవ్యాప్తంగా గత రెండు నెలల కాలంలో మొతత్ంగా 808 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నది. తాజాగా 474 పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 25 పార్టీలపై చర్యలు తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లో 17 ఉండగా, తెలంగాణలో 8 పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
Election Commission: తాజాగా రద్దు చేసిన పార్టీల్లో ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్‌సత్తా పార్టీపైనా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. తెలంగాణలో ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నది.
Election Commission: ఆరేళ్లుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం, పార్టీ కార్యాలయ చిరునామా, ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో ఎన్నికల సంఘం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నది. దీంతో చిన్నా చితక పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ పోటీ చేస్తే స్వతంత్ర అభ్యర్థులగానే పోటీ చేయాల్సి ఉంటుంది.