OG: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ అభిమాని సుజిత్ దర్శకత్వం వహించగా, టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు అభిమానుల్లో విపరీతమైన అంచనాలు రేకెత్తించాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణం, పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌తో కూడిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశాభావాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా విడుదల సందర్భంగా ఏపీ ప్రభుత్వమే ఓ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ‘ఓజీ’ టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. 25న తెల్లవారుజామున ఒంటి గంటకు ఏర్పాటు చేసిన బెనిఫిట్ షోకు టికెట్ ధరను రూ.1000గా నిర్ణయించారు. అదేవిధంగా సాధారణ ప్రదర్శనల్లో కూడా రేట్లను పెంచే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.125, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.150 అదనంగా వసూలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే, పొరుగుని తెలంగాణలో ‘ఓజీ’ మూవీ టికెట్ రేట్లపై ఇంకా స్పష్టత రాలేదు. అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మొత్తానికి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఓజీ’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. భారీ అంచనాలు, ప్రత్యేక టికెట్ రేట్లతో ఈ చిత్రం ఆరంభ వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.