Aarogyasri

Aarogyasri: తెలంగాణలో ఆరోగ్య శ్రీకి బ్రేక్..

Aarogyasri: తెలంగాణలో ఆరోగ్య శ్రీ పథకానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పెండింగ్ బిల్లులను చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ, రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు బుధవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పేద రోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగించనుంది.

పెండింగ్ బిల్లుల భారం
కొన్ని నెలలుగా ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు చెల్లించడం లేదని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బకాయిల మొత్తం కోట్లలో ఉందని, దీనివల్ల ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారిందని పేర్కొంటున్నాయి. సిబ్బంది జీతాలు, మందుల కొనుగోలు, ఇతర ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీ సేవలను కొనసాగించడం సాధ్యం కాదని ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం తెలిపింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *