Aisa Cup 2025: ఆసియా కప్ 2025లో పాకిస్థాన్-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో పాకిస్థాన్ జాతీయ గీతం ప్లే చేయాల్సి ఉంది. అయితే, గ్యాలరీలలో ఉన్న అభిమానులు తమ మొబైల్ ఫోన్లలో ప్లే చేసుకుంటున్న పాటలు, అలాగే కొంతమంది పాకిస్థానీ DJలు వారి స్థానిక పాటలను ప్లే చేయడంతో స్టేడియం అధికారిక DJ తప్పుగా టెస్లియాంగ్ జైన్ యొక్క ప్రసిద్ధ పాట జలేబి బేబీని ప్లే చేశాడు.
జలేబి బేబీ పాటను వినగానే పాక్ క్రికెటర్లు, అభిమానులు కాస్త ఆశ్చర్యపోయారు. ఈ ఫన్నీ సంఘటనను చూసి టీమ్ ఇండియా ఆటగాళ్లు నవ్వుకున్నారు. వెంటనే ఈ పొరపాటును గమనించిన స్టేడియం DJ, క్షమాపణలు చెప్పి, సరైన పాకిస్థాన్ జాతీయ గీతాన్ని ప్లే చేశాడు.
ఇది కూడా చదవండి: Shoaib Akhtar: నాకైతే మాటలు రావడం లేదు
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు దీనిపై అనేక ఫన్నీ కామెంట్స్ చేస్తూ, ‘జలేబి బేబీ’ ఇప్పుడు పాకిస్థాన్ జాతీయ గీతమని సరదాగా పోస్ట్ చేస్తున్నారు. కాగా ఆసియా కప్ మ్యాచ్ జరిగే సమయంలో ఈ సంఘటన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్‌తో ఆడనుంది.