Breaking: హైదరాబాద్‌లో హనీట్రాప్ ఘటన కలకలం రేపుతోంది. యోగా గురువు రంగారెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఓ గ్యాంగ్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే—అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళలు రంగారెడ్డి యోగాశ్రమంలో చేరారు. ఆ తర్వాత ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను సీక్రెట్‌గా రికార్డు చేశారు. వీటిని ఆధారంగా చేసుకుని అమర్ గ్యాంగ్ రంగారెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసింది.
మొదట రూ.50 లక్షల చెక్కులు ఇచ్చిన రంగారెడ్డికి, మరో రూ.2 కోట్లు ఇవ్వాలని గ్యాంగ్ ఒత్తిడి తెచ్చింది. ఇబ్బందులు తట్టుకోలేక చివరికి రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.