OTT Platform: వినోద రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకు వచ్చేందుకు కొత్త ఓటీటీ రాబోతోంది. బెంగళూరు బేస్డ్ గా ఓటీటీ సంస్థ గ్లోపిక్స్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిని విన్సే ఎల్ ఏ, అనిత సంయుక్తంగా స్థాపించగా.. లోకేష్ ఫౌండర్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. మారుతి రాజీవ్ నేషనల్ హెడ్‌గా, రూపేశ్ మామిళ్లపల్లి టెక్నికల్ హెడ్‌గా బాధ్యతలు నెరవేర్చుతున్నారు. తాజాగా సంస్థ లోగోను సౌత్ లో బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ లలో ఆవిష్కరించారు. ఈ యేడాది వేసవిలో పూర్తి స్థాయిలో ఓటీటీ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
OTT Platform: ఈ ఫ్లాట్ ఫాంలో ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాల్టీ షోలు ఉంటాయని, 360 డిగ్రీల ఎంటర్టైన్మెంట్‌ను అందించబోతున్నామని గోపిక్స్ హెడ్ మారుతీ రాజీవ్ తెలిపారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఫౌండర్ మెంబర్ లోకేశ్, హైదరాబాద్ కంటెంట్ హెడ్ రూపేశ్ కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Game Changer: ఐమాక్స్ వర్షన్ లో ‘గేమ్ ఛేంజర్’
‘పెళ్ళికూతురు పార్టీ’ దర్శకురాలి మృతి!
Aparna: తెలుగు చిత్రాలను రూపొందించిన అపర్ణ మల్లాది క్యాన్సర్ తో పోరాడుతూ తన 54వ యేట కన్నుమూశారు. నటి, రచయిత, దర్శకురాలు అయిన ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. తెలుగు చిత్రసీమలోకి కి అపర్ణ ‘ది అనుశ్రీ ఎక్స్ పిరిమెంట్స్’ అనే మూవీతో అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘పోష్ పోరిస్’ అనే వెబ్ సీరిస్ తీశారు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కించారు. రెండేళ్ళ క్రితం ప్రిన్స్ హీరోగా ‘పెళ్ళికూతురు పార్టీ’ మూవీని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన ఆమె అమెరికాలో చికిత్స చేయించుకుంటూ రెండవ తేదీ ఉదయం లాస్ ఏంజెల్స్ లో మరణించారని సన్నిహితులు తెలిపారు.
స్పాట్: పెళ్ళికూతురు పార్టీ మూవీ సాంగ్ ప్లే చేయాలి.