Jubilee Hills: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలో పోటాపోటీ నెలకొన్నది. ఇప్పటికే ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. ఇప్పటికే ఈ సీటుకై పోటీ పడుతున్న కొందరు నేతలను సముదాయిస్తూ వస్తున్నది. ఎవరికి ఈ టికెట్ ఇస్తే గెలుపొందుతారోనని సమీకరణాలను సమీక్షిస్తున్నది. అయితే ఆ పార్టీలో కీలక నేతలైన ఇద్దరు తాజాగా ఈ సీటుకోసం పోటీ పడుతున్నారు.
Jubilee Hills: గత అసెంబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన క్రికెటర్ అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సైడ్ తప్పించింది. ఆయన ఉప ఎన్నిక ఉంటుందన్న నాటి నుంచి తనకే జూబ్లీ హిల్స్ టికెట్ కాంగ్రెస్ ఇస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. ఆయనను ఎలాగైనా తప్పించాలని రాష్ట్ర ముఖ్యనేతలు భావించి, అధిష్టానాన్ని ఒప్పించి ఎమ్మెల్సీగా టికెట్ ఇప్పించి పోటీ నుంచే తప్పించారు.
Jubilee Hills: ఈ దశలో రాష్ట్ర ముఖ్య నేతలు ఓ నేతకు ఇద్దామని అనుకుంటున్న తరుణంలో ఇదే పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఈ సీటుపై కన్నేశారు. ఏకంగా తాను పోటీ చేస్తానని, తనకు మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుపడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను తోడుగా ఉన్నానని, అధిష్టానం ఆదేశిస్తే తాను జూబ్లీహిల్స్ నుంచి తప్పక పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.
Jubilee Hills: జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక అభ్యర్థికే ప్రాధాన్యం ఇస్తామని, బీసీ నేతకే టికెట్ ఇవ్వాలని రూలేమీ లేదని స్పష్టం చేశారు. పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని, పార్టీ సర్వే చేస్తుందని, అభ్యర్థులు ఎవరైనా కలిసి పనిచేయాలంటూ ఆదేశించారు. ఈసారి ఎలాగైనా జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు.
Jubilee Hills: ఈ దశలోనే అంజన్‌కుమార్ యాదవ్ ప్రతిస్పించారు. స్థానికుడికే ఇవ్వాలనేం లేదని, తాను సీనియర్ నేతనని, బీసీనని, పార్టీ తనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకే ఇవ్వాలని కరాకండిగా చెప్తున్నారు. ఆ తర్వాత తనకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని అంజన్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.
Jubilee Hills: ఇదే దశలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తూ తాను జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా కోరుతున్నారు. ఈ స్థానం టికెట్ విషయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకోవాలని, లేదంటే నష్టపోతుందని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పకనే చెప్పారు. దీంతో అటు అంజన్‌కుమార్ యాదవ్, ఇటు దానం నాగేందర్ ఇద్దరూ పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వీరిద్దరిలో ఒకరికి టికెట్ ఇస్తుందా? మరో కీలక నేత నవీన్ యాదవ్‌కు ఇస్తుందా? ఇస్తుందా? కొన్ని రోజుల్లోనే తేలనున్నది.