US Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలను ఉద్దేశించి చేసిన ఒక పోస్ట్‌లో, ఉక్రెయిన్ యుద్ధం ముగిసే వరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా చూడాలని కోరారు. అదే సమయంలో, నాటో దేశాలన్నీ కలిసి చైనాపై 50% నుంచి 100% వరకు భారీ సుంకాలు విధించాలని సూచించారు.ఈ సుంకాల ప్రతిపాదనకు ఆయన ఒక ప్రధాన కారణం చెప్పారు. చైనాకు రష్యాపై బలమైన పట్టు ఉందని, ఈ భారీ సుంకాలు ఆ పట్టును బలహీనపరుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bigg Boss 9: బిగ్ బ్రేకింగ్.. బిగ్ బాస్ నుంచి ఆమె ఔట్?
తద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించవచ్చని ఆయన వాదించారు.గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై సుంకాలు విధించిన ట్రంప్, ఈ తాజా వ్యాఖ్యల్లో మాత్రం భారత్ గురించి ప్రస్తావించలేదు. బహుశా, తన దృష్టిని చైనా వైపు మళ్లించినట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలపై చైనా స్పందిస్తూ, తాము యుద్ధాల్లో పాల్గొనడం లేదని, ఎవరికీ కుట్రలు చేయమని స్పష్టం చేసింది. అయితే, ట్రంప్ ఈ వ్యాఖ్యలు ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.