Dhoom Dhaam: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘ధూం ధాం’. దీనిని లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు సాయి కిశోర్ మచ్చా. గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన ‘ధూం ధాం’ నవంబర్ 8న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సమక్షంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సినిమాలో ఐదు పాటలు రాయడం పాటు సెకండ్ హీరోయిన్ తండ్రి పాత్రను పోషించినట్టు రామజోగయ్యశాస్త్రి చెప్పారు. ఇందులో తనది బిజినెస్ మ్యాన్ పాత్ర అన్నారు. పూర్తి స్థాయిలో ఎంటర్ టైనింగ్ గా ఉండే మూవీ ఇదని డైలాగ్ రైటర్ ప్రవీణ్ వర్మ చెప్పారు. గోపీ మోహన్ కథ, గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ అని దర్శకుడు సాయికిశోర్ మచ్చా తెలిపారు. తమ చేతన్ కోసమే ఈ సినిమా నిర్మించానని ప్రొడ్యూసర్ రామ్ కుమార్ అన్నారు.
ఇది కూడా చదవండి: Ram Talluri: నవంబర్ రామ్ తాళ్లూరి దేనా