Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఓ అరుదైన వాహనం బయటపడింది. బ్రిటీష్ పాలనా కాలంనాటి ఒక పాత ట్రాక్టర్ వెలుగులోకి వచ్చింది. అది ఇప్పటి మాదిరిగా పెట్రో ఉత్పత్తులతో కాకుండా ఆవిరి యంత్రంతో నడిచే వాహనంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వందేళ్ల క్రితం నాటిదని వారు ఈ సందర్భంగా గుర్తించారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాల్లో ఈ వందేళ్ల నాటి ఒక పాత ట్రాక్టర్ బయటపడింది. ఆవిరితో నడిచే ఈ ట్రాక్టర్‌ను పొలాలను దున్నడానికి, కాల్వల నిర్మాణంలో సామగ్రిని తరలించడానికి ఉపయోగించేవారని గుర్తించారు. అది ఈనాటి ట్రాక్టర్ ఆకారంలోనే ఉన్నదని, ఆ ఆకారం నుంచే ఇప్పటి ట్రాక్టర్ రూపం పుట్టి ఉంటుందని చెప్తున్నారు.
Uttar Pradesh: ఈ అరుదైన ట్రాక్టర్ బ్రిటీష్ పాలకులు ఇంగ్లండ్‌ను తెప్పించినట్టుగా చెప్తున్నారు. ఇలాంటి 8 ట్రాక్టర్లను భారతదేశంలో పనుల కోసం రప్పించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ 8 ట్రాక్టర్లలో ఇదీ ఒకటని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్‌కు సంబంధించిన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.