mechanic rocky

Mechanic Rocky: ఐ హేట్ యూ మై డాడీ అంటున్న ‘మెకానిక్ రాకీ’

Mechanic Rocky: విశ్వక్ సేన్ నయా మూవీ ‘మెకానిక్ రాకీ’ ఈ నెల 22న విడుదల కాబోతోంది. మీనాక్షి చౌదరి, శ్రద్థా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేస్తున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు వచ్చాయి. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ‘మెకానిక్ రాకీ’ నుండి మూడో పాటగా ఫాదర్ సెంటిమెంట్ సాగ్ రిలీజ్ అయ్యింది. ‘ఐ హేట్ యూ మై డాడీ’ అంటూ సాగే ఈ పాటను సనారే రాయగా, రామ్ మిరియాల పాడారు. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ను హ్యూమరస్ గా, ఎంటర్ టైనింగ్ గా ఇందులో దర్శకుడు రవితేజ ముళ్ళపూడి ప్రెజెంట్ చేశారు. ఈ యేడాది ఇప్పటికే విశ్వక్ సేన్ నటించిన ‘గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలు విడుదలయ్యాయి. మరి ఈ మూడో చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Thug Life Glimpse: కమల్‌హాసన్ ‘థగ్‌ లైఫ్‌’ టీజ‌ర్ రిలీజ్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *