Bhatti vikramarka: కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్‌ను తీవ్రంగా విమర్శించారు. “ఇప్పటికైనా కేసీఆర్ సభకు హాజరై సమాధానం చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు. పనకచర్ల సమస్యకు బీఆర్ఎస్ పాలననే కారణమని ఆరోపించారు.
ఘోష్ కమిషన్ నివేదికను చెత్తబుట్టలో వేయడం ప్రజల పట్ల అవమానం అని భట్టి పేర్కొన్నారు. “నివేదికను చెత్తబుట్టలో వేసారంటే, ప్రజలు మిమ్మల్ని ఎక్కడ వేశారో కూడా ఆలోచించండి” అంటూ ఎద్దేవా చేశారు.
గత పదేళ్లలో సభలో తాము మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని, మైక్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా వాయిస్‌ను అణచివేశారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. “అరచి అరచి అలసిపోయాం, కానీ బయటికి పోలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తట్టుకున్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు.