Raja Saab

Raja Saab: రాజా సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Raja Saab: ప్రభాస్ అభిమానులకు పండగలా మారిన రాజా సాబ్ చిత్రం గురించి హాట్ న్యూస్! నిర్మాత విశ్వప్రసాద్ మిరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సంచలన ప్రకటన చేశారు. ఈ భారీ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రొమాంటిక్ హారర్ జానర్‌లో రూపొందుతోంది. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ నటిస్తుండగా, భారీ స్థాయిలో విజువల్స్, యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకోనున్నాయి. సినిమా కథలో ప్రేమ, హారర్ మిక్స్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వనున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *