Kiren Rijiju: మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ప్రణాళికా సంఘం సభ్యురాలిగా పనిచేసిన సయీదా హమీద్ అస్సాం పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆమె మాట్లాడుతూ “బంగ్లాదేశీయులు కూడా మనుషులే, ప్రపంచం చాలా అందులో వాళ్ళు కూడా నివసించవచ్చు.. కాబట్టి వారికి భారత్‌లో నివసించే హక్కు ఉండాలి” అని పేర్కొన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఆయన స్పందిస్తూ, “మానవత్వం పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడం తగదు. ఇది కేవలం మానవత్వం సమస్య కాదు, మన భూమి, మన జాతి గుర్తింపు సమస్య. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో మైనారిటీ హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు ఎందుకు హింసించబడుతున్నారు? అక్రమ వలసదారులకు మద్దతు ఇవ్వడం దేశ భద్రతకే ముప్పు” అని అయన వ్యాఖ్యానించారు.
కార్యకర్తల ఆరోపణలు – ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
హమీద్‌తో పాటు సివిల్ సొసైటీ కార్యకర్తలు ప్రశాంత్ భూషణ్, హర్ష్ మందార్ కూడా అస్సాం ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. “రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను బంగ్లాదేశీయులుగా ముద్ర వేసి అన్యాయంగా లక్ష్యంగా చేస్తోంది. ప్రజల ఇళ్లను కూల్చివేస్తూ వారిని బంగ్లాదేశ్‌కు తోసేస్తోంది” అని భూషణ్ ఆరోపించారు. ఆయన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై “చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారు, ఇది పూర్తిస్థాయి దోపిడి” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న బాలకృష్ణ.. స్పందించిన పవన్ కళ్యాణ్
అస్సాం ప్రభుత్వ సమర్థన
మరోవైపు, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తమ చర్యలను సమర్థించుకున్నారు. అక్రమ స్థిరనివాసాల తొలగింపు రాష్ట్ర శాంతి, భద్రత కోసం అవసరమని చెప్పారు. కాంగ్రెస్ మరియు ఇతర మేధావుల జోక్యం రాష్ట్ర స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నమని ఆయన ఆరోపించారు.
కార్పొరేట్లకే లాభం?
అంతేకాకుండా, అస్సాంలో గిరిజన భూములను అదానీ గ్రూప్‌తో సహా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్థానిక సమాజాల ఖర్చుతో ఎంపిక చేసిన కార్పొరేషన్లకు లాభం చేకూర్చడమే ఈ చర్యల ఉద్దేశమని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు.