Pawan Kalyan: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`లో పవన్ పేరు కళ్యాణ్ అని పడుతుంది. పవన్ కళ్యాణ్ అని మారింది మాత్రం రెండో సినిమా `గోకులంలో సీత నుండే. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో, శ్రీ పద్మ సాయి చిత్ర బ్యానర్ మీద వచ్చిన లవ్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది. రాశి హీరోయిన్. తమిళంలో కార్తీక్ నటించిన గోకులథిల్ సీతై (Gokulathil Seethai) కి రీమేక్. అన్నయ్య చిరంజీవి జన్మదినం అయిన ఆగస్టు 22, 1997న రిలీజ్ అయిన తమ్ముడి గోకులంలో సీత.. నేటితో 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటోంది. కోటి సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక్కడి నుండి కొణిదెల కళ్యాణ్ బాబు కాస్తా పవన్ కళ్యాణ్ గా గుర్తింపు పొందాడు.

