Chiranjeevi Birthday

Chiranjeevi Birthday: ఒక్కడే సూర్యుడు.. ఒక్కడే చంద్రుడు.. ఒక్కడే మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Birthday: టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు గర్వంగా అనిపిస్తుంది. ఎలాంటి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన ప్రతిభ, కష్టపడి పనిచేసే తత్వం, అద్భుతమైన నటనతో “మెగాస్టార్” స్థాయికి చేరుకోవడం చిరు కెరీర్‌లోని అసాధారణ ఘట్టం.

ఈ రోజు చిరంజీవి 70వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న చిరు, అవకాశాల కోసం ఎంతగానో పోరాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక దశలో అవకాశాలు రాక ఆత్మహత్య ఆలోచన చేసిన స్థితి నుండి, నేడు భారతీయ సినీ పరిశ్రమలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఆయన గట్టిపట్టు, పట్టుదలకే నిదర్శనం.

చిరు సినిమాలు ఒకప్పుడు విడుదల అవుతాయని తెలిసినప్పుడే థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొనేది. ఫ్యాన్స్ బారులు తీరుతూ సినిమాలు చూడడం అప్పట్లో సాధారణం. ఆ క్రేజ్ ఈ రోజుకి తగ్గలేదు. ఈ తరం యువతకు కూడా చిరు ఒక ప్రేరణ, ఒక ఐకాన్. ఆయన డ్యాన్స్, యాక్షన్, నటన అన్నీ కొత్త హీరోలకు పాఠాలుగా ఉంటాయి.

కెరీర్ మొత్తం వివిధ రకాల పాత్రల్లో నటించి, ప్రతి రోల్‌లో ఒదిగిపోయే నైపుణ్యాన్ని చూపించారు. ప్రత్యేకంగా ఆయన డ్యాన్స్‌కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేరే స్థాయి ఫాలోయింగ్ ఉంది. అందుకే చిరంజీవి కేవలం ఒక స్టార్ మాత్రమే కాకుండా, ఒక “సంస్కృతి”గా మారిపోయారు.

ఇప్పటికీ యంగ్ హీరోలతో సమానంగా పోటీ పడుతూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. త్వరలోనే ‘విశ్వంభర’,ఇంకా  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో కనిపించనున్నారు.

చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు చెబుతున్న ఒకే మాట –
“ఎంత చెప్పినా తక్కువే… మెగాస్టార్ చిరంజీవి ఒకరే… ఎప్పటికీ ఒక్కడే!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *