Supreme Court

Supreme Court: యూపీలో మదర్సాల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు!

Supreme Court: యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. అంటే ఉత్తరప్రదేశ్‌లో మదర్సాలు కొనసాగుతాయి.  16,000 మదర్సాలలో చదువుతున్న 17 లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలనే ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడింది. మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

యుపి మదర్సా చట్టంలోని అన్ని నిబంధనలు ప్రాథమిక హక్కులను లేదా రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించవని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే పీజీ, పరిశోధనల సిలబస్‌ను నిర్ణయించే హక్కు మదర్సాలకు ఉండనే మదర్సా చట్టంలోని నిబంధనను సుప్రీంకోర్టు నిషేధించింది. అంటే ఇప్పుడు మదర్సా బోర్డు ఉన్నత విద్య సిలబస్, పుస్తకాలను నిర్ణయించదు.

Supreme Court: ఏప్రిల్ 5, 2024న, మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీనిపై కేంద్ర, యూపీ ప్రభుత్వాల నుంచి సమాధానం కూడా కోరింది.

ఈ కేసును 2024 అక్టోబర్ 22న ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సెక్యులరిజం అంటే జీవించండి..  జీవించనివ్వండి అని అర్థం చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *