Pulivendulalo Shivangulu: పులివెందుల ఉప ఎన్నికలో మహిళా లోకం మేల్కొనేలా పనిచేసింది రాయలసీమ జిల్లాలకు చెందిన టీడీపీ మహిళా నాయకత్వం. ముఖ్యంగా ఆ నలుగురు మహిళామణులు వైసీపీపై విరుచుకుపడి నియంతృత్వ సంకెళ్లను బద్దలు కొట్టారు. పులివెందుల జెడ్పీ ఉప ఎన్నికల్లో ఆ నలుగురు శివంగుల తాండవానికి వైసీపీ కోట బీటలు వారింది. కడప ఇంచార్జ్ మంత్రి సవితమ్మ మొదట్నుంచి అధిష్టానం తన మీద పెట్టుకున్న నమ్మకానికి పదింతలు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ బుల్లెట్‌లా దూసుకుపోతున్నారు. నేడు పులివెందుల జెడ్పీ ఎలక్షన్ టాస్క్ కూడా ఆమె నేతృత్వంలోనే నడిచింది. ఇక మంత్రి సవిత నాయకత్వానికి తోడయ్యారు కడప రెడ్డమ్మ. తనదైన శైలిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి మహిళల్ని కట్టిపడేశారు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి. ఇక అగ్నికి ఆజ్యంలా ఎంటరయ్యారు కర్నూల్ ఫైర్ బ్రాండ్ లీడర్ బైరెడ్డి బిడ్డ శబరి. ఈ ముగ్గురి మద్ధతుతో జెడ్పీటీసీ అభ్యర్థి బీటెక్ సతీమణి మారెడ్డి లతారెడ్డి ఎక్కడా తగ్గేదేలా అంటూ.. ప్రచార జోరు కొనసాగించారు. ముఖ్యంగా పులివెందుల మహిళా లోకం ఆలోచించేలా ప్రచారం చేశారు. ఏది ఏమైనా పులివెందుల ఉపఎన్నికలో ఈ నలుగురు శివంగులు కీలకంగా మారారు. వీరి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అయిందనే చెప్పచ్చు.
Also Read: PM Modi: 79వ స్వాతంత్య్ర దినోత్సవం: ఎర్రకోటపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం
మహిళా శక్తి అనంతం. ఆమె సంకల్పం అఖండం. ఇది ముమ్మాటికి నిజం అని నిరూపించారు ఈ నలుగురు శివంగులు. కడప ఇంచార్జ్ మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో మహానాడు సభ ఇదే కడప గడ్డపై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మళ్లీ బాక్స్ ఆఫీస్ బద్ధలయ్యేలా పులివెందుల గెలుపుతో రాష్ట్రాన్నే షేక్ చేసారు ఈ నలుగురు మహిళా నేతలు. ఎన్నికల ప్రచారంలో ఈ నలుగురు మహిళా ప్రజా ప్రతినిధులే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా కడప ఇంచార్జ్ మంత్రి సవితమ్మ అయితే సైలెంట్ మోడ్‌లో సునామినే సృష్టించారని చెప్పక తప్పదు. సీఎం చంద్రబాబు కడపలో మహిళలు రాజకీయంగా ఎదగడానికి ఫుల్ పవర్స్ ఇచ్చేసినట్లున్నారు. టీడీపీ అధిష్టానం మహిళామణులపై పెట్టుకున్న ఆ నమ్మకమే పులివెందుల గెలుపుకు శ్రీకారం చుట్టిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో బీటెక్ సతీమణి మారెడ్డి లతారెడ్డి వైసీపీని మడత పెట్టేశారని తమ్ముళ్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.