Health Tips: చాలా మంది కొవ్వును తగ్గించుకోవడానికి గ్రీన్ టీ తాగుతారని, అయితే కేవలం గ్రీన్ టీతో ఫిట్ సాధించడం చాలా కష్టమని అంటున్నారు పలువురు వైద్య నిపులు. అయితే.. ఫిట్ నెస్ సాధించాలంటే గ్రీన్ టీతోపాటు ముఖ్యమైన దినుసులను కలిపి తీసుకోవాలని చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
దాల్చిన చెక్క పొడి:
బరువు తగ్గాలనుకుంటే గ్రీన్ టీ మాత్రమే తాగొద్దని.. దానిలో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే మేలు జరుగుతుందంటున్నారు. ఈ పొడి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందట.
పుదీనా ఆకుల రసం:
గ్రీన్ టీలో పుదీనా ఆకుల రసాన్ని కలిపి తాగడం వల్ల బరువు తగ్గడం కూడా సహాయపడుతుంది. పుదీనా రసం బరువు తగ్గడంలో చాలా మేలు చేస్తుంది.
ఇది కూడా చదవండి: Moringa Leaves Benefits:ఈ ఆకుతో చేసిన హెయిర్ మాస్క్ అప్లై చేస్తే నల్లని నిగ నిగలాడే జుట్టు గ్యారెంటీ..
నిమ్మ, అల్లం కూడా వేసి:
గ్రీన్ టీలో నిమ్మ, అల్లం రసం కలుపుకుని త్రాగాలి. ఈ టీని రోజుకు మూడు సార్లు త్రాగాలి. ఇలా చేయడం వల్ల కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు.
కాగా, చాలా మంది ఉదయాన్నే అధిక కేలరీల బిస్కెట్లు లేదా గ్రీన్ టీతో నామ్కీన్ తింటారు. ఈ అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుంది.ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం మంచిది కాదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే.. రాత్రిపూట టీ తాగడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. రాత్రిపూట మేల్కొంటే, జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే సన్నగా ఉండాలంటే సాయంత్రం తర్వాత టీ తాగడం మానేయండి.