Hindu Temples: అమెరికాలో వేర్పాటువాదులు మళ్లీ అల్లర్లు సృష్టించారు. ఇండియానా రాష్ట్రం, జాన్సన్ కౌంటీలో ఉన్న అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ దేవాలయం (BAPS Temple)పై ఖలిస్థాన్ వేర్పాటువాదులు దాడి చేశారు. ఈ విషయాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ‘ఎక్స్’లో (మాజీ ట్విట్టర్) వెల్లడించింది.
ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా ఆలయ గోడలపై అనేక ద్వేషపూరిత నినాదాలు రాశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన ఈ సంఘటనను నిర్వాహకులు మరియు హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించారు.
ఇది కూడా చదవండి: Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశం మారనుందా ? CJI కీలక వ్యాఖ్యలు
ఆలయ నిర్వాహకుల ప్రకారం, ఈ ఏడాదిలో అమెరికాలోని హిందూ ఆలయాలపై ఇది నాలుగో దాడి. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ఆలయం వద్ద భద్రతను పెంచాలని వారు డిమాండ్ చేశారు.
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటన వెనుక భారత వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా యూఎస్‌లోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయాలకు తగిన భద్రత కల్పించేందుకు అక్కడి అధికారులను కోరింది. మార్చిలో కూడా దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ప్రసిద్ధ హిందూ దేవాలయం ఇలాంటి దాడికి గురైనట్లు గుర్తుచేసింది.