IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నవంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా గడ్డపై జరుగనున్న ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇప్పటికే ప్రకటించారు. టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపించనుండగా.. దక్షిణాఫ్రికాకు ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహించనున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ , అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ , రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్ ఉండగా..భారత్‌తో టీ20లో సిరీస్‌లో తలపడే దక్షిణాఫ్రికా జట్టులో ఎయిడెన్ మార్క్రమ్ , ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కొయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిల్ సిమెమెలన్, ట్రిస్టన్ స్టబ్స్, లుథే సిపామ్లా ఎంపికయ్యారు.
