Taapsee Pannu

Taapsee Pannu: డామినేట్ చేసే హీరోయిన్స్ కి స్టార్స్ నో ఛాన్స్

Taapsee Pannu: ‘ఝమ్మంది నాదం’తో నటిగా పరిచయమైన తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్ కి షిప్ట్ అయింది. ఆరంభంలో దక్షిణాది సినిమాలకే పరిమితమైన తాప్సీ నెమ్మదిగా బాలీవుడ్ లోనే కుదురుకుంది. అక్కడ తనదైన బాణీ పలికిస్తూ సినిమాలు చేయటమే కాదు బోల్డ్  కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉంటూ వస్తోంది. తాజాగా మరోసారి స్టార్స్ పై పంచ్ వేసింది తాప్పీ. టాప్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్స్ ఎంపిక కూడా స్టార్స్ ఇష్ట ప్రకారమే జరుగుతుందని కామెంట్ చేసింది తాప్సీ. అంతే కాదు ఏ స్టార్ హీరో అయినా తనని డామినేట్ చేసే హీరోయిన్ కి మాత్రం ఛాన్స్ ఇవ్వరనేసింది. స్వీయానుభవంతో ఈ మాట అంటుందో లేక జనరలైజ్ చేసి చెప్పిందో ఏమో కానీ అమ్మడి మాటలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇక ‘జుడ్వా, డుంకీ’ సినిమాల్లో పారితోషికం కూడా తక్కువగా తీసుకున్నానని, ఎక్కువ తీసుకుని కూడా తమనే కామెంట్ చేసిందని అనేలా చేయకూడదనే అలా ఎప్పుడూ తీసుకునేంత మాత్రమే తీసుకున్నానంటోంది తాప్సీ. మొహమాటం లేకుండా మాట్లాడే తాప్సీ సినిమాల ఎంపికలోనూ ఆచి తూచి వ్యవహరిస్తోంది. వ్యాపారాత్మక సినిమాలకంటే తనకు నచ్చిన కథలతో తెరకెక్కే సినిమాల్లోనే నటిస్తూ వస్తున్న తాప్సీ మాటలకు స్టార్ హీరోలు భుజాలు తడుముకోక తప్పదు. ఏమంటారు!?

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *