Beedha Masthan Minister: ఉమ్మడి నెల్లూరు జిల్లా. పేరుకు ఇది రెడ్ల జిల్లా అయినా కూడా మెజారిటీ ఓటర్లు బలహీనవర్గాలే. ఆర్థికంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బీసీలు బలంగా ఎదిగారు. అటువంటి సామాజికవర్గం నుండి తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు నిఖార్సైన లీడర్‌కు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి బీసీ కులాల్లో వ్యక్తమవుతూనే ఉంది. జగన్ ధైర్యం చేసి, పాలిటిక్స్‌లో జూనియర్ అయినా కూడా మంత్రి పదవిని అనిల్ కుమార్ యాదవ్‌కు ఇచ్చి, బీసీలకు కట్టిపడేశారు. కానీ, తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇంకా ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి బీసీకి మంత్రి పదవి దక్కకపోవడంతో బీసీ కులాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ కోసం నిలబడిన క్రమంలో రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయినప్పటికీ చంద్రబాబు దగ్గర తగిన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తితోనే పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావు వైసీపీలోకి వెళ్లడం జరిగిందనేది ఈ సందర్భంగా గుర్తుకు వస్తుంది. ఇదే కుటుంబం నుండి బీద రవిచంద్ర యాదవ్.. తన సోదరుడు బీద మస్తాన్ రావు వైసీపీలోకి వెళ్లిన టైంలో విపరీతమైన ఒత్తిడి ఎదురైనా కూడా తెలుగుదేశం జెండా వదలలేదు.
అధికారం ఉంటే ఉరుకులు పరుగులతో తిరిగే మంత్రులు, పవర్ పోగానే కనుమరుగై పత్తాలేకుండా పోయే వ్యాపార రాజకీయ లీడర్స్ లాగా కాకుండా… పవర్ ఉన్నా, ప్రతిపక్షమైనా నెల్లూరు వదలడు, పెద్దబాబు, చిన్నబాబులు పిలిస్తే పలుకుతాడని తెలుగుదేశం పార్టీలో గుడ్ విల్ సంపాదించుకున్న బీద రవిచంద్ర యాదవ్‌కు, హోదాలు కాదు పసుపు జెండాపై అభిమానం ముఖ్యం అని బోలెడు కష్టాలకు నిలదొక్కుకున్న బీద రవికి ఇప్పుడు కాకపోతే మంత్రి పదవి మరెప్పుడు అంటూ బీసీ కులాలు చర్చను లేవదీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని ఐదేళ్లు కూడా విశ్రాంతి లేకుండా కష్టపడ్డాడంటూ బీద రవిచంద్ర యాదవ్‌ని తమ్ముళ్లు బాగా అభిమానిస్తారు. కావలిలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నా.. తాను నాలుగు జిల్లాలో తిరిగితే పార్టీకి ఉపయోగ పడుతుందని పెద్దబాబు, చిన్నబాబులను ఒప్పించి రాయలసీమ జిల్లాల్లో ప్రచార బాధ్యతలు మీదేసుకుని, పార్టీకి అద్భుత విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించారట బీద రవి చంద్ర యాదవ్. అలకలు, బుజ్జగింపులు, డబ్బు సర్దుబాట్లు, ఓట్ల కూడికలు, తీసివేతలు, అభ్యర్థుల అవసరాలు, బీజేపీ, జనసేన లీడర్ల సమన్వయం, టీడీపీ సీనియర్లు, జూనియర్ల మధ్య ఐక్యత.. ఇలా అన్నింటిలో బీద రవిచంద్ర యాదవ్ 2024 ఎన్నికల్లో టీడీపీకి ప్లస్‌గా మారి.. బోలెడు పనులు చక్కబెట్టారని అంటారు.
Also Read: Rajahmundri Lo Adhi Brand: ఆదిరెడ్డి బ్రాండ్.. సౌండ్ అదిరెన్..
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు సారథి నారా లోకేష్ రేపు ముఖ్యమంత్రిగా, పార్టీ ప్రెసిడెంట్‌గా, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని బలంగా తయారు చేసుకోవాలంటే బీద రవిచంద్ర యాదవ్ లాంటి నిఖార్సైన, బీసీ కులాల ఫాలోయింగ్ ఉన్న లీడర్‌ను పవర్, పదవి, హోదా ఇచ్చి రెడీ చేసుకుంటే ఫ్యూచర్ పాలిటిక్స్‌లో ఉపయోగం ఉంటుందని కూడా తెలుగుదేశం పార్టీలో చర్చ నడుస్తోంది. ప్రతి ఎన్నికల్లో పార్టీలు మారుతూ, పవర్ ఉంటే ఇక్కడ, పవర్ కట్ అయితే జగన్ పక్కన చేరే లీడర్లకు మంత్రి పదవులు, హోదాలు ఎన్ని ఇచ్చినా దండగే అని… బీద లాంటి బీసీలను పెంచితే పెద్దబాబు, చిన్నబాబులకే మంచిదనే మాటలు కూడా బీసీ కులాల నుండి వినబడుతున్నాయి. ఇటీవల నీరు-చెట్టు బిల్లులు వందల కోట్లు రిలీజ్ అయిన క్రమంలో వేలాది మంది టీడీపీ సన్నకారు కాంట్రాక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా బీద రవిచంద్ర యాదవ్ చేసిన మంచిని గుర్తు చేసుకున్నారట.
జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి అనూహ్యంగా బీసీ నేత అనిల్ కుమార్ యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ కంటే అన్నింటిలోనూ బీద రవి ది బెస్ట్ అని, మరి తెలుగుదేశం పార్టీ బీద రవి లాంటి పవర్ ఫుల్ బీసీ లీడర్‌కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోతోందని ఇప్పుడు నెల్లూరు బీసీలలో చర్చోపచర్చలు నడుస్తున్నాయట. చూడాలి మరి. బీదకు పేరుకు ముందు, వెనక మంత్రి అనే హోదా వస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాలి.