Independence Day: 79వ స్వాతంత్య్ర దిన వేడుకలకు దేశ రాజధాని నగరమైన ఢిల్లీ ముస్తాబవుతున్నది. ప్రతి ఏటా జరిగినట్టుగానే ఈ ఏడాది కూడా ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలో స్వాతంత్య్ర దిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
Independence Day: అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రకోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు పరిసర ప్రాంతాల్లో బహుళ అంచెల భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు జరుపుకునేందుకు అన్నిచోట్ల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.