Banking News: 2025 ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగానే సెలవులు ఉన్నాయి. ఈ విషయాలను గుర్తుంచుకొని బ్యాంకుల ఖాతాదారులు తమ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆగస్టు నెలలో ఐదు ఆదివారాలు వస్తున్నాయి. వీటితోపాటు రెండో, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులకు సెలవు దినాలే. ఇవి కాకుండా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న శ్రీ కృష్ణ జన్మాష్టమి, 27న వినాయక చవితి సందర్భంగా బ్యాంకులకు సెలవులు. దీంతో ఒక్క ఆగస్టు నెలలో బ్యాంకులకు 10 సెలువు దినాలు వస్తున్నాయి.
