Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టు తీర్పునకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారంలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బీసీ కులగణనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేసిన రేవంత్‌రెడ్డి. కోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారంలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Grenade Blast: జమ్మూ కశ్మీర్‌లో పేలుడు..12 మందికి గాయాలు