Haridwar

Haridwar: హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట

Haridwar: హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసాదేవి ఆలయంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మందికి పైగా భక్తులు గాయపడినట్లు హరిద్వార్ ఎస్‌ఎస్‌పి వెల్లడించారు.

మానసాదేవి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. తొక్కిసలాటకు దారితీసిన కారణాలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. సమాచారం అందుకున్న గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు.

Also Read: KTR vs CM Ramesh War: కేటీఆర్‌ విలీన రాయ’బేరాలు’ నిజమే..! బీజేపీ ఎంపీ ఇంట్లో ప్రూఫ్స్‌?

ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ విషాదకర ఘటనతో హరిద్వార్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *