Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు పదునెక్కుతున్నాయి. తాజాగా, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
హరీష్ రావు ఏమన్నారంటే..
హరీష్ రావు మాట్లాడుతూ, “తెలంగాణ ద్రోహుల లిస్టు రాస్తే, అందులో మొదటి పేరు చంద్రబాబు నాయుడుది ఉంటే, రెండో పేరు రేవంత్ రెడ్డిది ఉంటది” అని అన్నారు. అంతేకాకుండా, “రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు” అని వ్యాఖ్యానించారు.
ఆయన తన ఆరోపణలను కొనసాగిస్తూ, “తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారుల పైకి రేవంత్ రెడ్డి రైఫిల్ తీసుకొని వెళ్లిన ద్రోహి” అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు పోరాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి అందుకు వ్యతిరేకంగా వ్యవహరించారని హరీష్ రావు ఆరోపించారు.