Hari Hara Veeramallu: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమాకు తెలంగాణలో కూడా టికెట్ ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల (జూలై) 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షక జనాల్లో ఉత్కంఠ నెలకొని ఉన్నది.
Hari Hara Veeramallu: భారీ క్రేజ్‌తో విడుదలకు సిద్ధంగా ఉన్న హరిహర వీరమల్లు సినిమాపై ట్రేడ్ వర్గాలు కూడా భారీ అంచనాలతో ఉన్నాయి. సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కోరుతూ సినిమా నిర్మాతలు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ మేరకు స్పందించిన సర్కారు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
Hari Hara Veeramallu: ఈ మేరకు హరిహర వీరమల్లు సినిమాకు సింగిల్ స్క్రీన్లపై రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే విధంగా ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సినిమా విడుదలకు ఒకరోజు ముందు అంటే జూలై 23న రాత్రి 9.30 గంటలకు ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు.
Hari Hara Veeramallu: పెరిగిన టికెట్ ధరలకు అనుగుణంగా జీఎస్టీ అదనంగా ఉంటుంది. అదే విధంగా ఈ నెల (జూన్) 24 నుంచి 27వ తేదీ వరకు ఐదు షోల ప్రదర్శనకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా, గతేడాది పుష్ప-2 సినిమా వివాదం తర్వాత మరే సినిమాకూ ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రీమియర్ షోకు అనుమతి పొందిన సినిమా హరిహర వీరమల్లు సినిమాయే కావడం విశేషం.

