A. M. Rathnam: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వస్తున్న భారీ బడ్జెట్ సినిమా “హరిహర వీరమల్లు” ఇప్పుడు అనుకోని సమస్యల్లో చిక్కుకుంది. జూలై 24న థియేటర్స్‌లో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు, నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ సమస్యలు ఎదురవుతున్నాయి.
ఏం జరిగింది?
నిర్మాత ఏ.ఎం. రత్నం గతంలో నిర్మించిన “ఆక్సిజన్”, “ముద్దుల కొడుకు”, “బంగారం” సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ నష్టాలు వచ్చాయని వారు ఆరోపిస్తున్నారు. ఆ సినిమాల హక్కులు కొనుగోలు చేసిన ఆసియన్ ఎంటర్‌ప్రైజెస్ మరియు మహాలక్ష్మి ఫిలిమ్స్ ఫిర్యాదు చేస్తూ, తాము పెట్టిన డబ్బు రిఫండ్ చేయకపోతే “హరిహర వీరమల్లు” సినిమాను నైజాంలో విడుదల చేయనివ్వమని స్పష్టంగా తెలిపారు.
-
ఆసియన్ ఎంటర్‌ప్రైజెస్ – “ఆక్సిజన్” సినిమాతో రూ.2.60 కోట్లు నష్టం వచ్చింది. ఒప్పందం ప్రకారం రిఫండ్ చేయాలి” అని డిమాండ్ చేశారు.
-
మహాలక్ష్మి ఫిలిమ్స్ – “ముద్దుల కొడుకు, బంగారం” సినిమాలకు రూ.90 లక్షల రిఫండబుల్ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి” అని కంప్లైంట్ చేశారు.
మొత్తం రూ.3.50 కోట్లు చెల్లిస్తేనే సినిమాను రిలీజ్ చేయనిస్తామని రెండు సంస్థలు స్పష్టంగా చెప్పాయి.
ఏ.ఎం. రత్నం ప్లాన్
నైజాం ఏరియాలో ఈ సినిమాకు థియేట్రికల్ హక్కులను పెద్ద మొత్తానికి ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో, నిర్మాత ఏ.ఎం. రత్నం తన స్నేహితుడు డీవీడీ సుబ్బారావుకి సుమారు రూ.40 కోట్లకు ఈ హక్కులు ఇచ్చారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అడ్డుకుంటే, ఆయనకూ పెద్ద ఇబ్బంది అవుతుంది.
సినిమా విడుదలపై సందేహాలు
మరికొన్ని రోజుల్లో థియేటర్స్‌లోకి రావాల్సిన “హరిహర వీరమల్లు” విడుదల ప్రస్తుతం అనుమానాస్పదంగా మారింది. ఏ.ఎం. రత్నం డిస్ట్రిబ్యూటర్స్ బకాయిలను క్లియర్ చేస్తేనే సినిమా రిలీజ్ అవుతుంది. లేకపోతే నైజాం ఏరియాలో విడుదల కష్టమని సమాచారం.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తున్నారు. మరి ఏ.ఎం. రత్నం చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

