Rk Roja

Rk Roja: మాజీ మంత్రి రోజా కన్నీళ్లు.. లైవ్‌లో బోరున ఏడ్చేశారు ఎందుకు అంటే.?

Rk Roja: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా (Roja) తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆమె భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజకీయ విమర్శలు సహజమే అయినా, వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ఆరోపణలు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయని రోజా పేర్కొన్నారు.

టీవీ చర్చలో రోజా గతంలో తనకు ఎదురైన ఒక బాధాకరమైన సంఘటనను వివరించారు. “నా కూతురి ఫోటోలు, అలాగే నేను, నా కొడుకుతో అప్యాయంగా ఉన్న ఫోటోల్ని నగ్నంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ దృశ్యాలను చూసినప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఆ స్థితిలో నా కుటుంబం, నా ఆత్మవిశ్వాసమే నాకు అండగా నిలిచాయి,” అంటూ రోజా బోరున ఏడ్చేశారు. ఈ వేధింపులు భరించలేక తన కుమార్తె కూడా అమెరికా వెళ్లిపోయిందని ఆమె వెల్లడించారు. ఇలాంటి నీచమైన పని చేసినవారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

తనపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్రంగా తగిలాయని రోజా అన్నారు. లోకేష్ ప్రోద్బలంతోనే భానుప్రకాష్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. “టీడీపీ పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టి తనను తిట్టిస్తున్నారని.. జబర్దస్త్ నుంచి ఒకడ్ని తీసుకొచ్చి మాట్లాడించారు.. ఎమ్మెల్యేలతో మాట్లాడించారన్నారు,” అని రోజా అన్నారు. భానుప్రకాష్‌కు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని, లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆయనకు ఈ ధైర్యం ఉంటుందా అని ఆమె ప్రశ్నించారు.

Also Read: Dosa: ఏపీలో దారుణం.. దోశ గొంతులో ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి

తనపై జరిగిన దుష్ప్రచారాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాధ్యత వహించాలన్నారు. “వారు ఇలా చేయించకుండా ఉంటే ఎవ్వరూ ఇంత దారుణంగా ప్రవర్తించరు. ఇవన్నీ రాజకీయాల్లో వ్యక్తిగతంగా నన్ను కించపరచే కుట్రలే,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ని రోజులు లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఈ వ్యక్తులను కాపాడతారో చూస్తానని రోజా సవాల్ విసిరారు. తనకు ఒక సమయం వస్తుందని, భగవంతుడు తనకు అండగా ఉంటాడని రోజా విశ్వాసం వ్యక్తం చేశారు. తనను బాధపెట్టిన ప్రతి ఒక్కరూ గతంలో జీవితంలో పెద్ద దెబ్బ తిన్నారని, చంద్రబాబుతో సహా చరిత్రను చూసుకోవాలని ఆమె గుర్తుచేశారు. మళ్లీ తన జోలికి వస్తున్నారని, కచ్చితంగా ఈసారి వారు జీరో అయిపోతారని రోజా హెచ్చరించారు. “వాళ్ల భార్యలు, కూతుళ్లు, కోడళ్లను ఏమైనా అంటే ఊరుకుంటారా?” అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రశ్నించారు. తనకు చాలా పట్టుదల ఎక్కువని, చంద్రబాబు, లోకేష్ తనను దొంగదెబ్బ తీయాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినా తాను తట్టుకుని నిలబడ్డానని, ఈసారి కూడా అదే చేస్తానని రోజా స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *